📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Suryakumar Yadav: ఫైనల్‌లో ఆస్ట్రేలియాపైనే ఆడాలి

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమానికి సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల వన్డే సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్‌కమింగ్ టీ20 టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది.

Read Also: Haryana: బాస్కెట్ బాల్ కోర్ట్ లో పోల్ విరిగిపడి..ప్లేయర్ మృతి

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) ని ఫైనల్‌లో ఎవర్నీ ఢీకొట్టాలని అనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. దాంతో సూర్య తన మస్సులోని కోరికను బయటపెట్టాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా ఆస్ట్రేలియాను ఓడించాలనుకుంటున్నాం.’అని నవ్వుతూ బదులిచ్చాడు.

Suryakumar Yadav: We should play against Australia in the final

ఇదే వేదికగా జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) టోర్నీ ఫైనల్లో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ క్రమంలోనే అదే మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకునే యోచనలో తమ జట్టు ఉందని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

ఫైనల్‌లో భారత్ ఉండాలి

ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పక్కనే ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మైక్, అందుకుని భారత్ ఫైనల్‌లో ఉండాలని చెప్పాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే పెద్ద విషయం కాదు, భారత్ ఫైనల్‌లో నిలిచి గెలవాలని చెప్పాడు. ‘నాకు ఒక్కటే ముఖ్యం, భారత్ ఫైనల్‌లో ఉండాలి. ప్రత్యర్థి జట్టు ఎవరు అనేది పెద్ద విషయం కాదు. మనం గెలవాలి అంతే’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

india cricket latest news Suryakumar Yadav t20 cricket Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.