📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Suryakumar Yadav: అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించినప్పటికీ, ఆ ప్రయాణంలో జరిగిన ఒక తప్పుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించడం తన తప్పేనని సూర్య అంగీకరించారు. ఈ నిర్ణయం వల్ల అక్షర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, దానికి క్షమాపణలు కోరానని ఆయన వెల్లడించారు.

Read Also: BCCI Awards 2026: ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ఆటతీరుపై అనుమానం

అక్షర్ పటేల్ ఈ నిర్ణయంతో చాలా కలత చెందాడని, మ్యాచ్ తర్వాత తాను ఆల్ రౌండర్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పానని సూర్యకుమార్ వెల్లడించాడు.ఈ నిర్ణయం భారత్‌కు దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమికి కారణమైంది. అంతే కాదు అప్పటివరకూ వరుసగా నాలుగు గ్రూప్ మ్యాచ్ లు గెలిచి ఫైనల్ ఫేవరెట్లలో ముందున్న టీమిండియా ఆటతీరుపై అనుమానాల్ని రేకెత్తించింది. అయితే ఈ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న భారత్.. తర్వాత జరిగిన జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్ ల్లో ఘన విజయాలతో సెమీస్ చేరడం, అక్కడ ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ చేరడం, చివరిగా కివీస్ ను ఇంటికి పంపడం జరిగిపోయాయి.

Suryakumar Yadav: Surya apologized to Akshar Patel.. what was the reason?

అయితే కెప్టెన్ సూర్య మాత్రం తన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకిరించడంతో పాటు అక్షర్ కు సారీ చెప్పడంతో అభిమానులు స్కై, పై ప్రశంసలు కురిపిస్తున్నారు.దక్షిణాప్రికా మ్యాచ్ కు తప్పించిన తన నిర్ణయంపై అక్షర్ చాలా కోపంగా ఉన్నాడని, అతను అలా ఉండటంలో తప్పేమీ లేదని సూర్య తెలిపాడు. ఎందుకంటే అతను అనుభవజ్ఞుడైన ఆటగాడని, ఓ ఐపీఎల్ జట్టును నడిపిస్తున్నాడని గుర్తుచేశాడు. అందుకే తాను క్షమాపణలు చెప్పానని,తనను క్షమించాలని కోరానని చెప్పుకొచ్చాడు. కానీ అది జట్టు కోసం తీసుకున్న ఓ నిర్ణయమని, అయితే అక్షర్ కు దీన్ని చెప్పడం కష్టమైందన్నాడు. అయితే అక్షర్ మాత్రం దాన్ని ధైర్యంగా తీసుకున్నాడని, మరుసటి రోజే తాము ఈ చర్చను ముగించామని వెల్లడించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Axar Patel India vs South Africa Super 8 Suryakumar Yadav T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.