📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Suryakumar Yadav: నా భార్య ఇచ్చిన సలహా వల్లే ఫామ్‌లోకి వచ్చా: సూర్య

Author Icon By Aanusha
Updated: January 24, 2026 • 7:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Suryakumar Yadav: I got into shape because of my wife’s advice

న్యూజిలాండ్ జట్టుతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఎట్టకేలకు తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. దాదాపు 468 రోజుల తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన పునరాగమనం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. తన భార్య ఇచ్చిన కీలక సలహాయే తనను తిరిగి ఫామ్‌లోకి తెచ్చిందని అతను వెల్లడించాడు.మ్యాచ్ అనంతరం బీసీసీఐ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఇషాన్ కిషన్‌తో సూర్య మాట్లాడాడు.

Read Also: Viral Video: హార్దిక్ పాండ్యా, మురళీ కార్తిక్‌ మధ్య వాగ్వాదం?

పూర్తిగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టా

ఫామ్ కోల్పోవడంపై ఇషాన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఒక కోచ్ ఉంటారు. వారే మన భార్యలు. నా భార్య కూడా నాకు ఒక సలహా ఇచ్చింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త సమయం తీసుకోమని ఆమె చెప్పింది. నా మనసును ఆమె బాగా చదవగలదు. ఆమె సలహాను పాటించి, నెమ్మదిగా ఆడటం ప్రారంభించాను.

అదే మంచి ఫలితాన్ని ఇచ్చింది” అని సూర్య వివరించాడు.అంతేకాకుండా ఇటీవల తీసుకున్న మూడు వారాల విరామం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కూడా తన మానసిక స్థితిని మెరుగుపరిచిందని సూర్య తెలిపాడు. “ఆ విరామంలో పూర్తిగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాను. నెట్స్‌లో బాగా ఆడుతున్నప్పటికీ, మ్యాచ్‌లో పరుగులు చేస్తేనే అసలైన ఆత్మవిశ్వాసం వస్తుంది. సహనంతో ఉండటం చాలా ముఖ్యం” అని, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

comeback innings half century latest news Suryakumar Yadav T20 captain Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.