📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Suryakumar Yadav: సంజు శాంసన్‌పై కెప్టెన్ ప్రశంసలు

Author Icon By Anusha
Updated: March 2, 2026 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Suryakumar Yadav: వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత, టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యాచ్ మాకు చావో రేవో లాంటిది. మా కుర్రాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఓపికగా వేచి ఉండే మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నేను నమ్ముతాను. జట్టులో లేనప్పుడు అతను తెర వెనుక పడ్డ కష్టం.. చేసిన కృషికీ సరైన సమయంలో తగిన ఫలితం దక్కింది. అతను ఆడిన తీరు వల్లే జట్టు గెలిచింది.మా బౌలర్లు ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేశారు.

Read Also: Gambhir: అతనికి కావాల్సింది జట్టు మేనేజ్మెంట్ నుండి సరైన మద్దతు

ఒత్తిడి లేకపోతే అందులో కిక్కు ఉండదు

ఇక్కడ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి, బంతి బ్యాట్ మీదకు వస్తుందని, 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని మాకు తెలుసు. ఆ తర్వాత మా బ్యాటర్లు చిన్న చిన్న భాగస్వామ్యాలతో స్పందించిన తీరే విజయానికి కీలకం.సెమీస్ చేరడం చాలా సంతోషంగా ఉంది. మొదటి మ్యాచ్ నుంచి మేం ఆడిన విధానం చూస్తుంటే, ఖచ్చితంగా సెమీస్ స్థానానికి మేము అర్హులం. అంచనాలు ఎప్పుడూ ఉంటాయి.

కానీ మైదానంలో ఏం చేయాలో మనకు తెలిసి ఉండాలి. మనపై చాలా మంది అంచనాలతో పాటు ఒత్తిడి ఉంటుందని మా కుర్రాళ్లకు చెప్పాను. కానీ ఇలాంటి మ్యాచుల్లో ధైర్యంగా ఉంటూ.. ఒత్తిడిలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి లేకపోతే అందులో కిక్కు ఉండదు. కడుపులో గందరగోళంగా అనిపిస్తుంది. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకుని ముందుకు వెళ్తామన్నదే ముఖ్యం.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India vs West Indies Sanju Samson SKY on Sanju Samson Suryakumar Yadav T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.