हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Mohammed Shami: షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

Anusha
Latest News: Mohammed Shami: షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami), ఆయన భార్య హసీన్ జహాన్ మధ్య కొనసాగుతున్న భరణం వివాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దంపతుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు గతంలో అనేకసార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Read Also: Virat-Anushka: విరాట్-అనుష్క బ్రేకప్ అంచులవరకు వెళ్లిన కథ

తాజాగా హసీన్ జహాన్, భరణం మొత్తాన్ని పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అయింది.భరణం మొత్తాన్ని పెంచాలని కోరుతూ హసీన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు సంబంధించి మహ్మద్ షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాని (Government of West Bengal) కి కూడా సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

నాలుగు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది.గతంలో కలకత్తా హైకోర్టు, హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.5 లక్షలు, వారి కుమార్తె సంరక్షణ కోసం రూ. 2.5 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది.

తమ అవసరాలకు సరిపోవడం లేదని

అయితే, ఈ మొత్తం తమ అవసరాలకు సరిపోవడం లేదని, భరణాన్ని మరింత పెంచాలని కోరుతూ హసీన్ జహాన్ (Hasin Jahan) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, తాజాగా ఈ నోటీసులు జారీ చేసింది.

నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది.మహ్మద్ షమీ (Mohammed Shami), హసీన్ జహాన్‌ల మధ్య 2018 నుంచి వ్యక్తిగత, న్యాయపరమైన వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.

Mohammed Shami
Mohammed Shami

నా పూర్తి దృష్టి నా క్రికెట్‌పైనే ఉంటుంది

అప్పట్లో షమీపై మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస, వరకట్న వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో షమీపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బీసీసీఐ (BCCI) అతనికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ,

వారి మధ్య వ్యక్తిగత వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.గతంలో తన వివాహం గురించి అడిగినప్పుడు షమీ స్పందిస్తూ.. “గడిచిపోయిన దాని గురించి నేను చింతించను. ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. నా పూర్తి దృష్టి నా క్రికెట్‌పైనే ఉంటుంది. నాకు ఈ వివాదాలు వద్దు” అని వ్యాఖ్యానించాడు. తాజా సుప్రీంకోర్టు నోటీసులతో వీరి వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870