📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Sunrisers Eastern Cape: SA20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్

Author Icon By Aanusha
Updated: January 26, 2026 • 9:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SA20 League నాలుగో సీజన్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) తమ సత్తాను చాటింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై ఏకపక్ష విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఈ టోర్నీలో మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2023, 2024లోనూ ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

Read Also: IND vs NZ 3rd T20I: భారత్ ఘన విజయం..

కట్టుదిట్టంగా బౌలింగ్

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు డెవాల్డ్ బ్రెవిస్ వెన్నెముకగా నిలిచాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి 101 పరుగులతో మెరుపు శతకం బాదాడు. అయితే సన్‌రైజర్స్ (Sunrisers Eastern Cape) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రిటోరియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి.

Sunrisers Eastern Cape: Sunrisers crowned SA20 League champions

కేవలం 48 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మాథ్యూ బ్రీట్జ్కే (68 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (63 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

champions latest news SA20 League Sunrisers Eastern Cape Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.