📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sunil Narine: న‌రైన్ ‘హిట్ వికెట్’ ఎందుకు ఔట్ ఇవ్వ‌లేదంటే?

Author Icon By Divya Vani M
Updated: March 23, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sunil Narine: న‌రైన్ ‘హిట్ వికెట్’ ఎందుకు ఔట్ ఇవ్వ‌లేదంటే కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆర్‌సీబీ ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించి బోణీ కొట్టింది.ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 16.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు తమ తొలి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించుకుంది.అయితే, ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ హిట్ వికెట్ వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.

Sunil Narine న‌రైన్ ‘హిట్ వికెట్’ ఎందుకు ఔట్ ఇవ్వ‌లేదంటే

నరైన్‌ను హిట్ వికెట్‌గా ఎందుకు ప్రకటించలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.ఎంసీసీ నిబంధనల ప్రకారం, బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగులు తీసే సమయంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు.నిన్నటి మ్యాచ్‌లో బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడిన అనంతరం, అతని బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ ఆ బంతిని వైడ్‌బాల్‌గా ప్రకటించినందున, నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై నెట్టింట్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేకేఆర్ బ్యాటింగ్‌లో సునీల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు స్కోరును గణనీయంగా పెంచాడు. అతని ఆటతీరు మ్యాచ్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమే ఆసక్తికరంగా మారింది.

EdenGardens HitWicketControversy IPL2024 KKR KKRvsRCB RCBVictory SunilNarine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.