📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Gautam Gambhir: గంభీర్‌కు సునీల్‌ గవాస్కర్‌ మద్దతు

Author Icon By Aanusha
Updated: November 27, 2025 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ పరాజయం అనంతరం మైదానంలోనే గంభీర్‌కు అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది.

Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కు జెమీమా అండ

జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారింది

ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ స్పందించారు. హెడ్‌కోచ్‌కు మద్దతుగా నిలిచారు. ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం అన్యాయమన్నారు. కోచ్‌ కోవలం జట్టును సిద్ధం చేయగలడని.. తన అనుభవంతో ఆటగాళ్లకు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలడని.. మైదానంలో రాణించాల్సింది ఆటగాళ్లేనన్నారు. గంభీర్‌ను బాధ్యుడిని చేయాలని అడుగుతున్న వారికి తాను ఒకటే ప్రశ్న అడుగుతున్నానని.. గంభీర్‌ (Gautam Gambhir) కోచింగ్‌లో భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ,

Sunil Gavaskar supports Gambhir

ఆసియా కప్‌ గెలిచినప్పుడు మీరేం చేశారని నిలదీశారు. అప్పుడు గంభీర్‌కు జీవితకాలం కాంట్రాక్ట్‌ ఇవ్వాలని అడిగారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారిందని గవాస్కర్‌ (Sunil Gavaskar) మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల వన్డే, ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ ఆడనున్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

india test cricket struggle india vs new zealand whitewash india vs south africa 2 0 loss latest news Sunil Gavaskar comments Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.