భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, అతడిని భారత మాజీ కెప్టెన్, ‘ది వాల్’గా పేరొందిన రాహుల్ ద్రవిడ్‌తో పోల్చడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్.. కర్ణాటకకు చెందిన ఇద్దరు రాహుల్‌ల మధ్య ఉన్న సారూప్యతను గుర్తు చేశారు. “కేఎల్ రాహుల్ ఎప్పుడూ ఒక క్లాస్ ప్లేయరే. అతని ఆట చూడముచ్చటగా ఉంటుంది.
Read Also: Bangladesh: బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ప్లేయర్ల తిరుగుబాటు
కేఎల్ రాహుల్ కూడా అలాగే చేస్తున్నాడు
సాంకేతికత, సహనం, అన్ని రకాల షాట్లు అతని దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు కర్ణాటకకే చెందిన మరో రాహుల్ (ద్రవిడ్) జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకునేవాడో, ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా అలాగే చేస్తున్నాడు. అతను క్రీజులో ఉంటే జట్టు సేఫ్ అనే నమ్మకం కలుగుతుంది” అని సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు.రాజ్‌కోట్ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే అవుటైన వేళ భారత్ కష్టాల్లో పడింది.
ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్, అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. కేవలం 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్, మొత్తం 92 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ స్కోరు 284కు చేరుకోవడంలో రాహుల్ పాత్ర కీలకం. ఒకవేళ అతను త్వరగా ఔట్ అయి ఉంటే, భారత్ 240 పరుగులు కూడా చేసేది కాదని గవాస్కర్ విశ్లేషించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: