Sun TV Network-CSK: ఐపీఎల్ క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఇప్పుడు న్యాయస్థానంలో చిక్కుల్లో పడింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (సన్ టీవీ నెట్ వర్క్), సీఎస్కే ఫ్రాంచైజీపై మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. తమ సినిమాలకు సంబంధించిన ఆడియో కంటెంట్‌ను వాణిజ్య ప్రచారంలో వాడుకున్నందుకు భారీ జరిమానా డిమాండ్ చేసింది.
Read Also: FIFA 2026: ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
అనిరుధ్ ఒప్పందాల సమర్పణ
తమ అనుమతి లేకుండానే జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్‌లు, డైలాగులను సీఎస్కే తమ ప్రచార వీడియోలో వాడుకుందంటూ రూ.1 కోటికి దావా వేసింది. వాణిజ్యపరంగా వాటిని ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.సీఎస్కే ఉపయోగించిన కంటెంట్ కాపీరైట్ రక్షణ పరిధిలో ఉందని, దీనిని వినియోగించుకోవాలంటే తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ చిత్రాల నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో తాము చేసుకున్న ఒప్పందాలను హైకోర్టుకు వారు సమర్పించారు.
కాపీ రైట్ కలిగిన కంటెంట్‌ను సీఎస్కే అనధికారికంగా వినియోగిస్తోందని మార్చి 1న మెయిల్ కూడా పంపించామని, దాంతో తమ మెటిరీయల్ వినియోగాన్ని సీఎస్కే నిలిపివేసిందని సన్ టీవీ తరఫున రవీంద్రన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం హక్కులన్నీ తమకే చెందుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.తాము ఇప్పటికే ఆ కంటెంట్‌ను నిలిపివేశామని చెన్నై సూపర్ కింగ్స్ కూడా హైకోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆంక్షలు, జరిమానాలపై నిర్ణయం తీసుకోవడానికి ముందు మరోసారి ఇరుపక్షాల వాదనలను వినాలని నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: