📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఓటమితో రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్

Author Icon By Anusha
Updated: March 5, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం నాడు దుబాయ్‌లో భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున 73 పరుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచినప్పటికీ, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో రెగ్యుల‌ర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయపడడంతో, ఈ టోర్నీలో స్మిత్ తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహించాడు.

వన్డే క్రికెట్

స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ లో టీం ఇండియతో ఓటమి తర్వాత స్టివ్ స్మిత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఈ ప్రకటనను ధ్రువీకరించింది. డ్రెస్సింగ్ రూమ్ లోనే తన టీం మేట్స్ తో స్మిత్ ఈ నిర్ణయాన్ని పంచుకున్నాడు.

2027 ప్రపంచకప్‌

2027 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం, కనుక వన్ డే క్రికెట్ కు ముగింపు చెప్పడానికి నాకు ఇది సరైన సమయమని భావిస్తునా, “టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఉంది .. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, శీతాకాలంలో వెస్టిండీస్, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ వేదికపై ఆడేందుకు నేను సిద్ధంగా ఉంటాను అని స్మిత్ తెలిపాడు.

కెప్టెన్సీ

స్మిత్ 2015 , 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత అతను 50 ఓవర్ల జట్టుకు కెప్టెన్సీని చేపట్టాడు. అతను 64 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు, 32 గెలిచాడు మరియు 28 ఓడిపోయాడు, నాలుగు ఫలితాలు లేవు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక ప్రాతిపదికన కెప్టెన్సీని చేపట్టాడు, గాయంతో అవుట్ అయిన పాట్ కమిన్స్‌ కు బదులు స్మిత్ కెప్టెన్సీ చేశాడు.స్మిత్ నిర్ణయం గురించి సెలెక్టర్ల జార్జ్ బెయిలీ మాట్లాడుతూ, “వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలనే స్టీవ్ నిర్ణయాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాము .ఆయనకు మద్దతిస్తున్నామని చెప్పాడు.

35 ఏళ్ల స్టీవ్ స్మిత్ తన వన్డే క్రికెట్ కెరీర్‌ను 170 మ్యాచ్‌లతో ముగించాడు. అతను 86.96 స్ట్రైక్ రేట్, 43.28 సగటుతో 5,800 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 164, 2016లో న్యూజిలాండ్‌పై నమోదు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు, లెగ్ స్పిన్నర్‌గా 28 వికెట్లు కూడా తీసుకున్నాడు. అలాగే, ఫీల్డింగ్‌లో తన ప్రతిభను చాటుతూ 90 క్యాచ్‌లు పట్టాడు.

రిటైర్మెంట్

ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమి అనంతరం, తన సహచరులతో కలిసి స్మిత్ వన్డే క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మీడియాతో మాట్లాడుతూ, అతను టెస్ట్ క్రికెట్, టీ20 ఫార్మాట్లలో అందుబాటులో ఉంటాడని పేర్కొంది. స్మిత్ తన క్రికెట్ కెరీర్‌లో అనేక మైలురాళ్లు అందుకున్నప్పటికీ, వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

#AUSCricket #AustralianCricket #ChampionsTrophy #CricketAustralia #CricketFans #CricketLegend #CricketNews #CricketStats #ICC #odicricket #OneDayCricket #Retirement #SmithRetires #SteveSmith Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.