బెంగళూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో తమ హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో కాకుండా వేరే ప్రదేశంలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం RCB అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Read Also: Abhishek Sharma: కొత్త టాటూ వేయించుకున్న అభిషేక్ శర్మ
పుణే కొత్త హోమ్ గ్రౌండ్‌గా?
సమాచారం ప్రకారం, (RCB) మేనేజ్‌మెంట్ మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని తమ ప్రత్యామ్నాయ హోమ్ గ్రౌండ్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో ఇటీవల జరిగిన రద్దీ ఘటనలు, సేఫ్టీ ఇష్యూల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

RCB అభిమానులకు ఈ నిర్ణయం పెద్ద నిరాశను కలిగించింది. సంవత్సరాలుగా చిన్నస్వామి స్టేడియంలో తమ అభిమాన జట్టును ప్రోత్సహిస్తూ వచ్చిన అభిమానులు, పుణేలో మ్యాచ్‌లు జరగడం వల్ల ఆ అవకాశం కోల్పోతున్నారు.
ఆర్థిక పరంగా కూడా ప్రభావం
చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి IPL మ్యాచ్ ద్వారా స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగాలు భారీగా లాభపడుతుంటాయి. RCB హోమ్ మ్యాచులు పుణేకు మారితే, బెంగళూరు నగరానికి ఆర్థిక పరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: