हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ పుకార్లపై శ్రీకాంత్ క్లారిటీ

Anusha
Latest News: Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ పుకార్లపై శ్రీకాంత్ క్లారిటీ

స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌నుంచి రిటైర్ కాబోతున్నాడనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆయన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని పునరుద్ధరించలేదనే సమాచారం బయటకు రావడంతో,

అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. “కోహ్లీ ఇక ఐపీఎల్‌ (IPL) లో కనిపించడా?”, “ఆర్‌సీబీకి ఇదే చివరి సీజనా?” అనే ప్రశ్నలు ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశమయ్యాయి.

Read Also: Shubhman Gill: రోహిత్‌ను పలికరించిన గిల్

అయితే ఈ వార్తలన్నింటికీ భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikanth) ఫుల్ స్టాప్ పెట్టారు. తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ, “అవన్నీ పుకార్లు మాత్రమే. విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడని చెప్పడం పూర్తిగా తప్పుడు వార్త. ఇటీవలే అతడు ఆర్‌సీబీ (RCB) కి మొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు.

అలాంటి సమయంలో రిటైర్ అవుతాడని అనుకోవడం అర్థరహితం” అని అన్నారు.కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని శ్రీకాంత్ పేర్కొన్నారు. “అసలు అతడు ఎందుకు రిటైర్ అవ్వాలి? ఈ ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. మరో మూడేళ్ల పాటు ఐపీఎల్ ఆడేంత సత్తా అతనికి ఉంది.

Virat Kohli

రిటైర్మెంట్ ఉండబోదని పేర్కొన్నారు

‘కింగ్ ఆఫ్ కింగ్స్’ అయిన కోహ్లీ (Virat Kohli) ఎప్పటికీ పరుగులు చేస్తూనే ఉంటాడు” అని ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటే తప్ప, రిటైర్మెంట్ ఉండబోదని పేర్కొన్నారు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

అతను ఇప్పటివరకు 8661 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 63కు పైగా అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016 సీజన్‌లో 973 పరుగులతో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870