IPL2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో మరో విధ్వంసకర బ్యాటర్ వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కొత్త ఆటగాడు సలిల్ అరోరా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం కొన్ని బంతుల్లోనే 198 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందులో వరుసగా 5 సిక్సర్లు బాదడం విశేషం.
Read Also: Laxman Siva Ramakrishnan Resignation: శివరామకృష్ణన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్
IPL 2026: ఆకట్టుకున్న నో-లుక్ సిక్సర్లు.. అభిషేక్ శర్మ మెరుపులు
సలిల్ అరోరా బాదిన సిక్సర్లలో ముఖ్యంగా అతని ‘నో-లుక్ సిక్సర్లు’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే ఈ సీజన్‌లో SRH బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమనిపిస్తోంది.
ఇవాళ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కొత్త ఆటగాడు సలిల్ అరోరా 198 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేశాడు. ఇందులో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. అతని నో-లుక్ సిక్సర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సలిల్ అరోరా 190 స్ట్రైక్ రేట్‌తో 350కి పైగా పరుగులు చేయడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: