టీ20 ఫార్మాట్‌లోనూ భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. శుక్రవారం తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Read Also: Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ
ఈ నేపథ్యంలో, శ్రీలంకతో జరిగిన 3వ టీ20లో ఇండియా ప్లేయర్లు పలు రికార్డులు సాధించారు. తాజా గెలుపుతో T20ల్లో అత్యధిక విజయాలు(77) అందించిన కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ నిలిచారు. తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్(76) ఉన్నారు. మరోవైపు ఓ T20 మ్యాచ్‌లో అత్యధిక శాతం పరుగులు బాదిన బ్యాటర్‌గా షెఫాలీ(79*) నిలిచారు. ఆమె నిన్న శ్రీలంకపై జట్టు స్కోరు(115)లో 68.69% రన్స్ చేశారు. ఇప్పటి వరకు 2011లో హర్మన్ చేసిన 66.12% పరుగులే అత్యధికం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: