📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Sports: టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ సంచలన కామెంట్స్

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 9:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)  సూపర్-4 దశలో భారత్‌తో తలపడే ముందు బంగ్లాదేశ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగుతోంది. ఇప్పటికే హాంకాంగ్, అఫ్ఘానిస్థాన్ వంటి జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఈ జట్టు, శ్రీలంకను కూడా షాక్‌కు గురి చేసింది. ఈ విజయాల తర్వాత బంగ్లాదేశ్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం భారత్‌తో తలపడనుండగా, ఈ మ్యాచ్ ముందు జట్టు హెడ్‌కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) మీడియాతో మాట్లాడారు.క్రికెట్‌లో ప్రతి జట్టుకి టీమిండియాను ఓడించే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించాడు.

ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యమని, రికార్డులు కాదని బీరాలు పలికాడు. “భారత్ నంబర్ వన్ టీ20 టీమ్ కావచ్చు. కానీ ప్రతి జట్టుకు భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉంది. మేం మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి.. వచ్చే మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తాం. మేం శ్రీలంక (Sri Lanka) ను మాత్రమే ఓడించేందుకు మాత్రమే ఇక్కడకు రాలేదు. ఆసియాకప్‌ టైటిల్ కోసం వచ్చాం,” అని సిమ్మన్స్ వ్యాఖ్యానించాడు.ఇక బంగ్లాదేశ్ జట్టు.. బుధవారం భారత్‌తో, ఆ తర్వాతి రోజు అంటే గురువారం పాకిస్థాన్‌తో తలపడనుంది.

Sports

వరుస రోజుల్లో మ్యాచ్‌లు ఆడటం ఏ జట్టుకైనా

దీనిపై కూడా సిమ్మన్స్ మాట్లాడాడు. వరుస రోజుల్లో మ్యాచ్‌లు ఆడటం ఏ జట్టుకైనా ఇబ్బందే అని.. ఇది అన్యాయమని చెప్పుకొచ్చాడు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కోచ్ (Bangladesh coach) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కొందరేమే.. అతడి కామెంట్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయని చెబుతున్నారు. మరికొందరేమో.. అతి విశ్వాసం ఉండకూడదని చురకలు అందిస్తున్నారు.ఇక ఆసియాకప్ సూపర్‌-4లో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంకపై సంచలన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సంచలన బ్యాటింగ్‌తో మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం ఆసియాకప్ సూపర్‌-4 పాయింట్స్ టేబుల్‌లో బంగ్లాదేశ్‌ రెండో ప్లేసులో ఉంది. సూపర్‌-4 మ్యాచ్‌లు ముగిసే సరికి టాప్‌-2లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఈ పోరు జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 bangladesh head coach statement Bangladesh vs India Breaking News hong kong latest news phil simmons comments sri lanka upset super 4 stage Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.