📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sourav Ganguly – బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా గంగూలీ

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 8:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్ష పదవిని చేపట్టారు. నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికతో గంగూలీకి బెంగాల్ క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం మొదలైంది.

సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కి బెంగాల్ క్రికెట్ సంఘంతో ఉన్న అనుబంధం కొత్తది కాదు. 2015 నుండి 2019 మధ్యకాలంలో ఆయన ఈ పదవిలో ఉన్నప్పుడు, బెంగాల్ క్రికెట్ (Bengal Cricket) అభివృద్ధి దిశగా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, యువ క్రికెటర్లను ప్రోత్సహించడం, స్థానిక టోర్నీలకు కొత్త ఫార్మాట్లను ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

క్యాబ్ అధ్యక్షుడిగా తన దృష్టి ఈడెన్ గార్డెన్స్

ఆ తర్వాత బీసీసీఐ (BCCI) అధ్యక్షునిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టి తన పరిపాలనా నైపుణ్యాన్ని చాటారు.ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. క్యాబ్ అధ్యక్షుడిగా తన దృష్టి ఈడెన్ గార్డెన్స్ అభివృద్ధిపైనే ఉండనుందని చెప్పారు. ప్రస్తుతం 68,000గా ఉన్న ఈ స్టేడియం సీటింగ్ సామర్థ్యాన్ని తిరిగి లక్షకు పెంచేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమాన్ని 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత చేపడతామని స్పష్టం చేశారు.

Sourav Ganguly

టెస్టు మ్యాచ్ నిర్వహణ ఒకటి

గంగూలీ అధ్యక్షతన క్యాబ్ ముందుగా అధిగమించాల్సిన ముఖ్యమైన కార్యక్రమాల్లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ నిర్వహణ ఒకటి. ఈ మ్యాచ్ ఈ ఏడాది నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens) లో ఆరేళ్ళ విరామం తర్వాత జరగనున్న టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

చివరిసారి ఇక్కడ 2019లో భారత్ – బంగ్లాదేశ్ మధ్య డే/నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పట్లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. “రెండూ అగ్రశ్రేణి జట్లు. ఇది మంచి టెస్టు మ్యాచ్ అవుతుంది. మ్యాచ్‌కి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఏర్పాట్లపై త్వరలో బీసీసీఐతో చర్చిస్తా,” అని తెలిపారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-pakistan-vs-sri-lanka-match-today/sports/552434/

94th annual general meeting Bengal Cricket Association Breaking News CAB president Indian cricket history latest news re-elected Sourav Ganguly Telugu News unanimous election

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.