📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Sourav Ganguly: భారత్ లో క్రికెట్ ప్రతిభ పెరుగుతూనే ఉంటుంది

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ క్రికెటర్ల ప్రతిభను ప్రశంసిస్తూ భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ టూర్ సందర్భంగా భారత జట్టు మంచి ప్రదర్శన చేయగలదా అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, బ్యాటింగ్ లైనప్‌పై సందేహాలు నెలకొన్నాయి. కానీ యువ క్రికెటర్లు అంచనాలను తలకిందులు చేస్తూ, తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాల బాటను చూపించారు.ఇంగ్లాండ్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ నిర్వహించగా, భారత జట్టు ప్రారంభంలో వెనుకబడినా, చివరికి సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో జట్టులోని యువ ఆటగాళ్ల పాత్ర అమోఘంగా నిలిచింది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) వంటి యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. టాప్–6 అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో నలుగురు భారత ఆటగాళ్లే ఉండటం, ఈ ఫార్మాట్‌లో మన ఆటగాళ్ల టాలెంట్‌కు నిదర్శనం అని చెప్పొచ్చు.

యువ ఆటగాళ్లు చూపిన ప్రదర్శనను

ఈ సందర్భంగా సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ “మన దేశంలో క్రికెట్‌కు కొదవ లేదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఒకరు వెళ్తే మరొకరు సిద్ధంగా ఉంటారు. విరాట్, రోహిత్ లాంటి దిగ్గజులు రిటైర్ అయినా, భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు. ఇది నిరూపణగా ఇప్పుడు మన యువ ఆటగాళ్లు చూపిన ప్రదర్శనను చూడండి” అని పేర్కొన్నారు.సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన తర్వాత ఆ లోటును సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) భర్తీ చేశారని, అదే సమయంలో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వచ్చారన్నారు. తదుపరి వచ్చిన విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్‌గా ఎదిగారన్నారు. కోహ్లీ తర్వాత యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ స్టార్స్‌గా మారారని తెలిపారు. భారత క్రికెట్‌లో చాలా ప్రతిభ ఉందని, అది పెరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.

Sourav Ganguly:

టీమిండియా ప్రదర్శనపై

మన దేశవాళీ క్రికెట్ చాలా బలంగా ఉందని అన్నారు. ఐపీఎల్, భారత్ ఏ జట్టు, అండర్ – 19 జట్టు రూపంలో మనకు చాలా వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను గెలవకపోయినప్పటికీ టీమిండియా ప్రదర్శనపై గంగూలీ సంతృప్తి వ్యక్తం చేశారు. శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్‌కు అభినందలు తెలిపిన గంగూలీ.. భారత టాప్ ఆరుగురు బ్యాటర్లు కేఏల్ రాహుల్, గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారని ప్రశంసించారు

సౌరభ్ గంగూలీ క్రికెట్ కెరీర్ ప్రారంభం ఎప్పుడు జరిగింది?

సౌరభ్ గంగూలీ తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు 1996లో ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

గంగూలీ కెప్టెన్‌గా చేసిన ప్రధాన కృషి ఏమిటి?

గంగూలీ కెప్టెన్‌గా భారత క్రికెట్ జట్టుకు కొత్త శక్తినిచ్చాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, జట్టులో పోరాట స్పూర్తిని పెంచాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mohammed-siraj-owaisi-praises-pura-khol-diye-pasha-siraj-responds/sports/527214/

Breaking News India vs England Test series Indian batting lineup Indian cricket future latest news Rohit Sharma Retirement Sourav Ganguly Telugu News top Indian batters virat kohli retirement young Indian players

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.