📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Arshdeep Singh: కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్

Author Icon By Aanusha
Updated: December 11, 2025 • 9:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను మాత్రమే కాదు, వాటిని ఎలా సానుకూల దిశలో మలుచుకున్నాడో కూడా తాజాగా పంచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో తనకు ఆడే అవకాశం లభించలేదని తెలిసిన తర్వాత తన గదిలో ఒంటరిగా ఉంటూ బోర్‌గా ఫీలయ్యేవాడినని, ఆ సమయంలోనే యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించానని టీమిండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) వెల్లడించాడు.

Read Also: T20: టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం

గదిలో ఒంటరిగా ఉంటూ బోర్‌గా ఫీలయ్యే

అర్ష్‌ దీప్ తన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాడు.తాజాగా జియో హాట్ స్టార్‌తో మాట్లాడుతూ, తాను యూట్యూబ్ ఛానల్‌ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో వివరించాడు. గదిలో ఒంటరిగా ఉంటూ బోర్‌గా ఫీలయ్యే సమయంలో ఈ ఛానల్‌ను ప్రారంభించినట్లు తెలిపాడు. ఛానల్‌ ప్రారంభించడం తనకు వరంగా మారిందని ఆయన పేర్కొన్నాడు.

Sometimes you have to wait for opportunities: Arshdeep

తాను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. ఈ స్థాయిలో ఆడుతున్నందుకు కృతజ్ఞతతో ఉండాలని, కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుందని చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకోవాలని వ్యాఖ్యానించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Arshdeep Singh Champions Trophy latest news Telugu News youtube channel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.