📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: Smriti Mandhana: నేడు స్మృతి మంధాన వివాహం

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్, ప్రపంచకప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) నేడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ అయిన పలాశ్‌ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. మహారాష్ట్రలోని స్మృతి స్వస్థలమైన సాంగ్లీలో నవంబర్ 23, 2025న మధ్యాహ్నం వీరి పెళ్లి వేడుక జరగనుంది.

Read Also: RO-KO: వన్డే సిరీస్.. డిసెంబర్ 6న వైజాగ్‌కు రో-కో

కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. గత వారం రోజులుగా వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళల ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్మృతి (Smriti Mandhana), టోర్నీ ముగిసిన వెంటనే పెళ్లి చేసుకోవడం విశేషం.

2019లో మొదలైన ప్రేమకథ

స్మృతి, పలాశ్‌ల ప్రేమకథ 2019లో ప్రారంభమైంది. అయితే, తమ కెరీర్‌లపై దృష్టి పెట్టేందుకు ఇన్నేళ్లుగా తమ బంధాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది జులైలో తమ ఐదేళ్ల ప్రేమకు గుర్తుగా సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల ప్రపంచకప్ గెలిచిన తర్వాత, ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పిచ్‌పైకి తీసుకెళ్లిన పలాశ్‌, ఆమెకు ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతకుముందే, పలాశ్‌ తన చేతిపై స్మృతి జెర్సీ నంబర్‌ ‘SM18’ అని పచ్చబొట్టు వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Palash Smriti Mandhana wedding Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.