భారత మహిళా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana), ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో, ఆసుపత్రిలో చేర్పించారు..
Read Also: IND vs SA: దక్షిణాఫ్రికాతో మ్యాచ్..ఇండియా 4 వికెట్లు డౌన్
అయితే, ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉంది. ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదు. మెరుగైన నిర్ధారణ కోసం వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ కూడా నిర్వహించారు. ఇందులో గుండెకు రక్త ప్రసరణలో ఎటువంటి అడ్డంకులు లేవని తేలింది.
అన్ని పరీక్షలు, చికిత్సల అనంతరం శ్రీనివాస్ మంధానను మంగళవారం (నవంబర్ 25, 2025) నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తన తండ్రి ఆరోగ్యం కోలుకోవడమే తనకు ముఖ్యమని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్మృతి మంధాన (Smriti Mandhana) స్పష్టంగా చెప్పినట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ధ్రువీకరించారు.
కొత్త తేదీని ప్రకటిస్తారా
కాబోయే, భర్త పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal) కూడా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు వైరల్ ఇన్ఫెక్షన్‌తో పాటు ఎసిడిటీ సమస్య తలెత్తడంతో కొద్దిసేపు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు.ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఒకవైపు తండ్రి కోలుకోవడం సంతోషాన్నిచ్చినా,
మరోవైపు కాబోయే భర్త ఆసుపత్రి పాలు కావడంతో పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే, స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి వేడుకల ఫొటోలను తొలగించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు కుటుంబాలు పెళ్లి కొత్త తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: