📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Smriti Mandhana: పెళ్లి పీటలు ఎక్కనున్న స్మృతి మంధాన

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. దేశవ్యాప్తంగా అభిమానులను తన బ్యాటింగ్‌తో మంత్రముగ్ధుల్ని చేసిన ఈ క్రికెటర్‌ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఆమె తన ప్రియుడు, బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్‌ (Palash Muchhal) ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Read Also: India vs Australia: మహిళల ప్రపంచ కప్‌..టాస్ ఓడిన భారత్

టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, వీరి పెళ్లి వేడుకలు స్మృతి మంధాన స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీ (Sangli) లో ఘనంగా జరగనున్నాయి. నవంబర్ 20న ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనే విధంగా ఈ వివాహ వేడుక జరగనుంది.

2019లో డేటింగ్ ప్రారంభించిన స్మృతి, పలాష్, జులై 2024లో వీరి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భావోద్వేగ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా వారి సంబంధాన్ని బహిరంగపరిచారు.స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సుమారు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Smriti Mandhana

క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

సోషల్ మీడియాలో వీరిద్దరూ తరచుగా కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల పలాష్ ముచ్ఛల్ స్వయంగా వీరి పెళ్లిని ధృవీకరించారు. ఇండోర్ నుంచి వచ్చిన పలాష్ ముచ్ఛల్… “స్మృతి (Smriti Mandhana) త్వరలో ఇండోర్‌కు కోడలు కాబోతోంది” అంటూ నవ్వుతూ ప్రకటించారు.

ఈ ప్రకటనతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.క్రికెట్‌లో తన కవర్ డ్రైవ్‌లు, మెరుపు బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి మంధాన.. ఇకపై సంగీత ప్రపంచంతో బంధుత్వం కలుపుకోబోతున్నారు. పలాష్ ముచ్ఛల్ బాలీవుడ్‌లో మంచి పేరున్న సంగీత దర్శకుడు. ఆయన సోదరి పాలక్ ముచ్ఛల్ (Palak Muchhal) కూడా ప్రముఖ గాయని అన్న విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

latest news Palash Muchhal Smriti Mandhana marriage Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.