Smriti Mandhana: WPL 2026 విజేతగా RCB

Read Time:  1 min
Smriti Mandhana: WPL 2026 విజేతగా RCB
FONT SIZE
GET APP

WPL 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని RCB 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది.ఈ విజయంతో ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలవడం విశేషం.

Read Also: Revolt Motors: బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఓపెనర్లు లిజెల్ లీ (37), షెఫాలీ వర్మ (20) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (57) కప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ (44), చివర్లో చినెల్ హెన్రీ (15 బంతుల్లో 35*) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203/4 పరుగుల భారీ స్కోరు సాధించింది.

డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి తొమ్మిది పరుగులకే గ్రేస్ హారిస్ వికెట్ కోల్పోయి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) (87), జార్జియా వోల్ (79) మైదానంలో పూనకం వచ్చినట్లు ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా మంధాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, డబ్ల్యూపీఎల్ ఫైనల్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

Smriti Mandhana: RCB emerge as WPL 2026 winners
Smriti Mandhana: RCB emerge as WPL 2026 winners

విజయం దిశగా సాగుతున్న ఆర్‌సీబీకి చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. జార్జియా వోల్, రిచా ఘోష్, చివరలో కెప్టెన్ మంధాన 19వ ఓవర్లో అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో బెంగళూరు గెలుపుకు 10 పరుగులు అవసరమైన దశలో, ఢిల్లీ బౌలర్లు ఒత్తిడి పెంచారు. అయితే ఆర్‌సీబీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సంయమనంతో ఆడి ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో వరుసగా రెండో ఏడాది ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవగా, ఢిల్లీకి మళ్ళీ రన్నరప్ నిరాశే మిగిలింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.