📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest news: Smriti Mandhana: మంధానకి పెళ్లి ప్రపోజల్ చేసిన పలాష్ ముచ్ఛల్‌..సరదా సన్నివేశం

Author Icon By Saritha
Updated: November 21, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌తో ఆమె పెళ్లి నవంబర్ 23న జరగనున్నట్లు సమాచారం. (Smriti Mandhana) ఈ జంట చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటోంది. ఈ శుభవార్త వెలువడుతున్న నేపథ్యంలో పలాష్ ముచ్ఛల్(Palash Muchhal) తన ప్రియురాలికి ఇచ్చిన ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలాష్ ముచ్ఛల్, స్మృతి మంధానకు ప్రపోజ్ చేయడానికి ఎంచుకున్న ప్రదేశం ఎంతో ప్రత్యేకమైనది. అది మరేదో కాదు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం. ఇటీవల భారత మహిళా జట్టు 2025 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది సరిగ్గా ఈ మైదానంలోనే. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న పవిత్ర స్థలంలోనే పలాష్ మోకాలిపై కూర్చుని మంధానను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ సర్‌ప్రైజ్ చేశాడు.

Read also: ‘రోడ్ డాక్టర్’ తో .. ఇక స్మూత్‌గా రహదారులు!

Palash Muchhal proposed marriage to Mandhana.

సినిమాటిక్ వీడియోతో పలాష్ సర్‌ప్రైజ్

పలాష్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ రొమాంటిక్ క్షణాల వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ దృశ్యం ఒక సినిమాటిక్ ఫీల్‌ను ఇచ్చింది. వీడియోలో పలాష్ మొదటగా స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి, ఆమెను స్టేడియం లోపలికి తీసుకువచ్చాడు. (Smriti Mandhana) గంతలు తీయగానే ఆమె ముందు మోకాలిపై కూర్చుని గులాబీల బొకే మరియు రింగ్ అందించి పెళ్లి ప్రపోజల్ చేశారు. ఈ ఊహించని సర్‌ప్రైజ్‌కి స్మృతి మంధాన ఆశ్చర్యానికి భావోద్వేగానికి లోనై చిరునవ్వుతో యస్ చెప్పింది. ఆ తర్వాత ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం వారి స్నేహితులు కూడా మైదానంలోకి వచ్చి కొత్త జంటను అభినందించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

2025 Women’s World Cup D.Y. Patil Stadium Engagement Indian Women’s Cricket Team Palash Muchhal Proposal Smriti Mandhana Wedding News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.