భారత మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన (Smriti Mandhana) తన కెరీర్‌లో మరో అపురూపమైన మైలురాయిని చేరుకుంది. ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆమె కేవలం ఒకే ఇన్నింగ్స్‌తో అనేక రికార్డులను తిరగరాసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడమే కాకుండా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
Read Also: Team India: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులో భారీ మార్పులు
ఆదివారం నాడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో స్మృతి ఈ రికార్డును నెలకొల్పింది. మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 27 పరుగుల దూరంలో ఉన్న ఆమె, కేవలం 20 బంతుల్లోనే ఈ మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మొత్తం 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది.
అగ్రస్థానంలో స్మృతి
ఈ ఘనతతో స్మృతి (Smriti Mandhana) .. మిథాలీ రాజ్, న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ సరసన చేరింది. ఇటీవల శ్రీలంక సిరీస్‌లోనే 4,000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గానూ స్మృతి నిలిచింది.2025లో వన్డేల్లో అత్యధిక పరుగులు (1,362) చేసిన క్రీడాకారిణిగా స్మృతి అగ్రస్థానంలో నిలిచింది.
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె రికార్డు సృష్టించింది. డిసెంబర్ 30న శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత, జనవరి 9 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: