📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Smriti Mandhana:రికార్డు సృష్టించిన స్మృతి

Author Icon By Aanusha
Updated: December 22, 2025 • 9:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడమే కాకుండా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మంధాన, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది. 

Read Also: IND-W vs SL-W: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

స్మృతి ఈ రికార్డును న‌మోదు చేసింది

టీ20లలో 4000 పరుగులు దాటిన రెండవ మహిళా క్రికెటర్‌గా ఆమె (Smriti Mandhana)నిలిచింది. నిన్న‌ శ్రీలంక‌తో జ‌రిగిన‌ తొలి టీ20లో ఆమె ఈ ఘ‌న‌త‌ను సాధించింది. విశాఖపట్నం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును న‌మోదు చేసింది. స్మృతి 154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో కివీస్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.  

Smriti has created a record

మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలు కలిపి ఐదుగురు మాత్రమే 4000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం సహా స్మృతి ఈ జాబితాలో చేరింది. ఇక‌, ఈ జాబితాలో మంధాన అతి పిన్న వయస్కురాలు కావ‌డంతో భవిష్యత్తులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Asian women cricketer latest news Smriti Mandhana Team India Women Telugu News Women T20I records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.