📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

స్మిత్ నాటౌట్ ..స్టంప్స్‌ను తాకినా ఎందుకు అవుట్ కాలేదో తెలుసా?

Author Icon By Sharanya
Updated: March 4, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌ ఉత్కంఠ భరితంగా మారింది. ముఖ్యంగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తృటిలో ఔట్ కాకుండా తప్పించుకున్న ఘటన అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్‌లో 14వ ఓవర్ చివరి బంతికి స్మిత్ అవుట్ కాకుండా తప్పించుకోవడం క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది. ఐసీసీ నియమాల కారణంగా అతను ఔట్ కాకుండా నిలబడటం క్రికెట్ నిబంధనలపై ఆసక్తికరమైన చర్చలకు దారితీసింది.

ఐసీసీ నియమాల ప్రకారం అవుట్ ఎందుకు కాలేదు?

ఎంసీసీ చట్టం 29 ప్రకారం – వికెట్ తీసివేయబడిందని పరిగణించడానికి కనీసం ఒక బెయిల్ పూర్తిగా తొలగించబడాలి. ఈ కారణంగా స్మిత్‌ను అవుట్‌గా ప్రకటించలేదు. ఈ సంఘటనలో, బంతి స్టంప్‌ను తాకినప్పటికీ, బెయిల్స్ కదలలేదు. 4వ ఓవర్ చివరి బంతి – భారత బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఇది స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్మిత్ రక్షణాత్మకంగా ఆడిన బంతి ప్యాడ్‌ను తాకి స్టంప్స్‌ను తాకింది. అయితే, బెయిల్స్ పడలేదు, దాంతో స్మిత్ అవుట్ కాకుండా మిగిలిపోయాడు.

ముందు రనౌట్ మిస్

14వ ఓవర్లో జరిగిన ఈ సంఘటనకు ముందు, స్మిత్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.షార్ట్ ఫైన్ లెగ్ వైపు షాట్ ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా,మార్నస్ లాబుస్చాగ్నే పరుగు తీయడానికి నిరాకరించాడు. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి బంతిని అందుకోలేకపోవడంతో స్మిత్ క్రీజులోకి సురక్షితంగా చేరాడు. 22వ ఓవర్లో, భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో స్మిత్ క్యాచ్ మిస్ అయింది.ఇది ఆసీస్ జట్టుకు మరింత స్థిరపడే అవకాశం ఇచ్చింది. అభిమానులు, విశ్లేషకులు స్మిత్ లక్‌ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. నక్కతోక తొక్కి వచ్చింది అంటూ మేమ్స్ వైరల్ అయ్యాయి.ఐసీసీ నిబంధనలు సరైనవేనా? అనే చర్చ కూడా మొదలైంది. ఈ నిర్ణయం మ్యాచ్‌ను ఎంతవరకు ప్రభావితం చేసిందో,భారత్ పైన దీని ప్రభావం ఏమిటో చూడాలి.

#akshar patel #BailsNotFalling #ChampionsTrophy #CricketUpdates #ICCRules #IndvsAus #SteveSmith Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.