Siraj injured in nets: మహ్మద్‌ సిరాజ్‌కు గాయం

Read Time:  1 min
Siraj injured in nets: మహ్మద్‌ సిరాజ్‌కు గాయం
FONT SIZE
GET APP

Siraj injured in nets: టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 మ్యాచులు జరుగుతున్న వేళ భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. శుక్రవారం సాయంత్రం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అనూహ్యంగా గాయపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం జట్టును కలవరపెడుతోంది.

Read Also: IND W vs AUS W 3rd T20: నేడే ఆస్ట్రేలియాతో భారత్ చివరి టీ20

Siraj injured in nets
Siraj injured in nets

హార్దిక్ కొట్టిన బంతికి బలైన సిరాజ్

నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి నేరుగా వెళ్లి సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో అతను తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్ నెట్స్ నుంచి వెళ్లిపోయాడు.

ఈ మెగా టోర్నీలో సిరాజ్ ప్రయాణం మొదటి నుంచీ నాటకీయంగా సాగుతోంది. వార్మప్ మ్యాచ్‌ లో హర్షిత్ రాణా గాయపడటంతో చివరి నిమిషంలో సిరాజ్ జట్టులోకి వచ్చాడు. జస్‌ ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌ లో తుది జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్.. ఆ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. 3 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.