ఇండియా యంగ్ షట్లర్ (Shuttler) దేవిక సిహాగ్ థాయ్ ల్యాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ విమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచింది. దాంతో కెరీర్ లో తొలి BWF సూపర్ 300 టైటిల్ సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన 20 ఏండ్ల దేవిక, ప్రపంచ 68వ ర్యాంకర్, రెండుసార్లు జూనియర్ వరల్డ్ చాంపియన్ గో జిన్ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్ లో, దేవిక తొలి గేమ్ ను, 21-8తో సొంతం చేసుకుంది. రెండో గేమ్ లో, 6-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్ వె మ్యాచ్ నుంచి వైదొలిగింది.
Read Also: Ishan Kishan: ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను: ఇషాన్
చాలా ఆనందంగా ఉంది
దాంతో దేవికకు టైటిల్ ఖరారైంది. విజేత దేవికకు 18,750 డాలర్ల (రూ.17 లక్షల 19 వేలు) ప్రైజ్ మనీ తోపాటు, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత థాయ్ ల్యాండ్ సూపర్-300 టైటిల్ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక గుర్తింపు పొందింది. టైటిల్ గెలిచే క్రమంలో దేవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం.’చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదే తొలి సూపర్-300 లెవెల్ టైటిల్.
ఈ సీజన్ లో, మరిన్ని టోర్నీలు ఆడతాను. థాయ్లాండ్ ఓపెన్ లో, అన్ని మ్యాచ్ లు, బాగా ఆడాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ఫైనల్ లో, గెలుపోటములు గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను’ అని దేవిక వ్యాఖ్యానించింది. బెంగళూరులోని పదుకొనే-ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్క్స్లో ఉమేంద్ర రాణా వద్ద దేవిక శిక్షణ తీసుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: