📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు

Latest News: Shubman Gill:  సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు బయల్దేరిన టీమిండియా

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు దిశగా ప్రయాణం ప్రారంభమైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో, సీనియర్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli, Rohit Sharma) లతో కూడిన తొలి బృందం ఈరోజు ఉదయం ఆస్ట్రేలియాకు బయల్దేరింది.

Read Also: Ranji Trophy : నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

ఇది క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పర్యటన, ఎందుకంటే సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ, రోహిత్ తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌లకు తిరిగి వచ్చారు. ముఖ్యంగా, వీరు జట్టులో ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా యువ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఉండడం ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకతను కలిగిస్తుంది.

జట్టులోని మిగిలిన సభ్యులు, సహాయక సిబ్బందితో కూడిన రెండో బృందం ఈరోజు రాత్రి 9 గంటలకు ఆస్ట్రేలియా (Australia) కు బయల్దేరనుంది. అక్కడికి చేరుకున్నాక భారత ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటారు. అనంతరం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతారు.

Shubman Gill

ఆ తర్వాత 23న అడిలైడ్ ఓవల్

ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈనెల‌ 19న పెర్త్ స్టేడియం (Perth Stadium) లో జరిగే తొలి వన్డేతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 23న అడిలైడ్ ఓవల్, 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ (Sydney Cricket Ground) లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి.

అనంతరం 29 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది.విదేశీ గడ్డపై తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్న టీమిండియా (Team India) కు ఈ పర్యటన ఒక అగ్నిపరీక్షగా నిలవనుంది. చివరిసారిగా 2020-21లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు భారత్ 1-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయి, అదే తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది.

ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని యువ కెప్టెన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలోని జట్టు పట్టుదలగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Australia tour 2025 Breaking News latest news Rohit sharma Shubman Gill Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.