📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shubhman Gill: టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

Author Icon By Anusha
Updated: October 13, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ (Shubhman Gill) 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్‌కు దిగిన తొలి కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో గిల్ ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేశాడు (Shubhman Gill) .ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.

Read Also: John Campbell: విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ తొలి సెంచరీ

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియాకు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. వెంటనే వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించిన టీమిండియా (Team India) కు ఆ జట్టు నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసిపోయారు.

రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు (West Indies batters) ఔట్ చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో భారత బౌలర్ల కష్టాలు రెట్టింపు అయ్యాయి. జాన్ కాంప్‌బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) సెంచరీలతో రాణించారు.

Shubhman Gill

ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి

ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. కాంప్‌బెల్‌ (Campbell) కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కాగా.. 8 ఏళ్ల తర్వాత షైహోప్ మరో శతకాన్ని అందుకున్నాడు.ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆధిక్యాన్ని అధిగమించి.. మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది.

93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇప్పటి వరకు మొత్తం 41 సార్లు ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించిన టీమిండియా.. నాలుగు సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది.

గిల్ నాయకత్వం కింద టీమిండియా బలంగా ఉన్నా, వ్యూహాత్మక నిర్ణయాలు మ్యాచ్ ఫలితంపై ఎంత ప్రభావం చూపుతాయో ఈ టెస్ట్ మరోసారి నిరూపించింది. వెస్టిండీస్ పోరాటం భారత్ బౌలర్లకు పరీక్షగా మారింది, గిల్ కెప్టెన్సీకి ఒక సవాలుగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News India vs West Indies Test Match latest news Shubhman Gill Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.