టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రమైన గాయానికి గురైన అయ్యర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, వైద్య బృందం పర్యవేక్షణలోనే కొనసాగుతున్నారు.
Read Also: Shefali: షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి – సెమీఫైనల్‌లో బలమైన భారత్!
అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ మూడో వన్డేలో కవర్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అలెక్స్ కేరీ క్యాచ్ పట్టేందుకు గాల్లోకి ఎగిరిన అయ్యర్ (Shreyas Iyer) బలంగా నేలపై పడిపోయారు. ఆ సమయంలో ఎడమ పక్కటెముకల వద్ద తీవ్ర గాయం కావడంతో వెంటనే మైదానాన్ని విడిచి వెళ్లారు. టీమ్ ఫిజియో మొదటగా ప్రాథమిక చికిత్స అందించినా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సిడ్నీ ఆసుపత్రిలో చేర్పించారు.
మొదట బీపీ డౌన్ అవడంతో ఐసీయూ (ICU) లో ఉంచారు.బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపిన సమాచారం మేరకు “శ్రేయస్ అయ్యర్ అక్టోబర్ 25, 2025న సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. దాంతో ఎడమ రిబ్ కేజ్ వద్ద తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన వైద్యపరంగా స్థిరంగా ఉన్నారు, క్రమంగా కోలుకుంటున్నారు.
స్నేహితులు ఆయనను తరచుగా కలుస్తుండగా
బీసీసీఐ (BCCI) మెడికల్ టీమ్ సిడ్నీ, భారత వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ అయ్యర్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోంది. టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్ సిడ్నీలో అయ్యర్‌తోనే ఉంటూ రోజువారీ ఆరోగ్య పరిణామాలను పరిశీలిస్తున్నారు.
”స్థానిక స్నేహితులు ఆయనను తరచుగా కలుస్తుండగా, కుటుంబ సభ్యులలో ఒకరు ముంబై నుంచి సిడ్నీకి ప్రయాణించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతం కారణంగా వీసా ప్రక్రియ కొంచెం ఆలస్యమైంది.
భారత్‌కు తిరిగి వచ్చే సమయాన్ని నిర్ణయించలేదు
ఇప్పటివరకు అయ్యర్ భారత్‌కు తిరిగి వచ్చే సమయాన్ని నిర్ణయించలేదు. అయ్యర్‌ను ఇప్పుడల్లా టీమిండియాలో ఆడించొద్దంటూ బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం అయ్యర్‌కి ప్రధానంగా పరిగణనలో ఉన్న ఫార్మాట్ వన్డే క్రికెట్ మాత్రమే. వచ్చే నెల చివరలో అంటే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తదుపరి అసైన్‌మెంట్‌గా ఉంది. ఆ సమయానికి పూర్తిగా కోలుకుంటాడో లేదో చూడాలి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: