📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shreyas Iyer: గాయం వల్ల 7 కిలోల బరువు తగ్గా.. ఐసీయూలో ఉన్న రోజులు గుర్తుచేసుకున్న పంజాబ్ కెప్టెన్

Author Icon By Aanusha
Updated: March 21, 2026 • 7:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో తగిలిన తీవ్రమైన గాయం (Spleen Injury) కారణంగా తాను పడిన శారీరక, మానసిక వేదనను ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందు వెల్లడించారు.

Read Also: IPL 2026: కేకేఆర్‌కు మరో షాక్.. సీజన్ మొత్తానికి ఆకాశ్ దీప్ దూరం?

shreyas-iyer-7kg-weight-loss-recovery-spleen-injury-ipl-2026

Shreyas Iyer: అయ్యర్ వెల్లడించిన కీలక అంశాలు

గతేడాది మొత్తం తనకు కష్టంగా గడించిందని చెప్పుకొచ్చాడు. గాయం కారణంగా ఏకంగా ఏడు కేజీల బరువు తగ్గినట్లు అతడు వివరించాడు. గాయం ప్రభావం నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టిందని, అది చాలా కష్టమని అయ్యర్ వ్యాఖ్యానించాడు.“గాయం వల్ల నేను దాదాపు 7 కిలోల బరువు తగ్గిపోయా. దానినుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్‌గా అనిపించింది.

ఎందుకంటే నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. కానీ 2 నెలలు తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడుప్పుడే నా పరిస్థితి మెరుగైంది. నా బాడీ ఫిట్‌నెస్ బాగుంది. అయితే ఓ పక్క ఫిట్‌గా ఉంటూనే.. నేను కోల్పోయిన ఏడు కిలోల బరువు పెరగడం అనేది కష్టమైంది. అయినా.. దాన్ని నేను అధిగమిస్తా. ఎందుకంటే ఇలాంటి ఎన్నోసార్లు నేను ఎదుర్కొన్నా. గాయంతో దూరమై, ఆ తర్వాత కమ్‌బ్యాక్ చేసి టీమిండియాకు ఆడిన రోజులు కూడా ఉన్నాయి” అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cricket News Telugu Today IPL 2026 PBKS vs GT Punjab Kings Captain IPL 2026 Shreyas Iyer 7kg Weight Loss Shreyas Iyer Recovery News Telugu Shreyas Iyer Spleen Injury Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.