📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Shoaib Akhtar: PCB చైర్మన్‌పై మండిపడ్డ మాజీ ఫాస్ట్ బౌలర్

Author Icon By Anusha
Updated: February 16, 2026 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ పాకిస్థాన్ ఓటమిపై అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మేము మ్యాచ్‌లో ఎక్కడా పోటీలోనే లేము. ఒకప్పుడు భారత్‌తో మైదానంలో పోరాడేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లను ఓడించడం అన్నది కలలో కూడా ఊహించలేం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also: T20 World Cup 2026: పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్

అజ్ఞాని లకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుంది?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీపై విరుచుకుపడ్డాడు. “క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యాడు. అలాంటి అసమర్థులకు ‘జాహిల్’ (అజ్ఞాని) లకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుంది?” అని తీవ్రంగా విమర్శించాడు. బాబర్ ఆజమ్‌ను ఉద్దేశించి, “మ్యాచ్ గెలిపించలేని ఆటగాడిని సూపర్ స్టార్‌ను చేశారు” అని షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మండిపడ్డాడు.

Shoaib Akhtar: Former fast bowler furious with PCB chairman

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అద్భుతమైన అర్ధశతకంతో చెలరేగగా, కెప్టెన్ సూర్యకుమార్ (32), శివమ్ దూబే (27) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అయూబ్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

India vs Pakistan latest news shoab akhtar T20 World Cup Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.