📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

IND vs NED: దూబే అద్భుతమైన బ్యాటింగ్‌తోనే ఈ విజయం: కెప్టెన్ సూర్య

Author Icon By Aanusha
Updated: February 19, 2026 • 12:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IND vs NED: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో వరుస విజయాలతో ఇప్పటికే సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా, గ్రూప్-ఏలో భాగంగా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్‌గా తనకు తలనొప్పేనని చమత్కరించాడు. శివమ్ దూబే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. 190 పరుగులు చేయగలిగాం.

Read Also: T20WC 2026: ఆసీస్ ఎలిమినేషన్‌పై రికీ పాంటింగ్ ఏమన్నారంటే?

నాకు తలనొప్పినే

మైదానంలో కొంచెం మంచు ఉంది. అది మా బౌలర్లకు కొంత సవాలుగా మారింది. కానీ ఆశించిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం కొన్నిసార్లు తొందరగా వికెట్లు కోల్పోవచ్చు. కానీ అప్పుడు బ్యాటర్లు తమ బాధ్యత ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యం.మా బ్యాటింగ్ లైనప్‌లో మెరుపులు మెరిపించే ఫైర్ పవర్ ఆటగాళ్లు ఉన్నారు. శివమ్ దూబే విశాఖ వేదిగా న్యూజిలాండ్‌తోనూ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాడు. ఆ రోజు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవాలనుకున్నాడు.

shivam-dube-brilliant-batting-led-to-victory-says-captain-surya

కానీ ఈ రాత్రి అతను జట్టుకు 190 పరుగుల భారీ లక్ష్యం అందించడం అద్భుతం.మేం అనుకున్నవన్నీ సరిగ్గా చేయగలిగాం. గెలిచినప్పుడు కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈ రోజు కూడా అనేక విషయాలు నేర్చుకున్నాం. మా జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు ఉండటం కెప్టెన్‌గా నాకు తలనొప్పినే. పిచ్ తగ్గట్లు మా బౌలర్లు రాణించగలరు. ప్రస్తుతం మా ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతీ బ్యాటర్ నుంచి సహకారం అందుతోంది. ఒకరిద్దరికి అద్భుతమైన రోజు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరి నుంచి సహకారం అందడం మాకు అవసరం.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ICC T20 World Cup 2026 IND vs NED Shivam Dube Suryakumar Yadav Team India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.