हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Shane Watson: కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్‌

Anusha
Latest News: Shane Watson: కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్‌

ఐపీఎల్‌ 2026 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు నిర్వహణ మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ (Shane Watson) ను అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించినట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేకేఆర్‌ జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది. వాట్సన్‌ క్రికెట్‌ మేధస్సు, ఆల్‌రౌండ్‌ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకం వ్యక్తం చేసింది.

Read Also: IPL-2026: మినీ వేలంలో పాల్గొననున్న CSK?

అద్భుతమైన కెరీర్‌

ఆస్ట్రేలియా తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచులు ఆడిన వాట్సన్‌ (Shane Watson) .. ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 10వేలకుపైగా పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 280 కంటే ఎక్కువ వికెట్ల పడగొట్టాడు. వాట్సన్‌ 2007, 2015లో ప్రపంచకప్‌ గెలిచి ఆస్ట్రేలియా జట్టులో కీలకపాత్ర పోషించాడు.

2008 నుంచి 2020 వరకు ఐపీఎల్‌లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడాడు. రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగాడు. క్రికెట్ నుంచి రిటైర్‌ అయ్యాక వాట్సన్‌ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లో కోచ్‌, మెటర్‌ పాత్రలు పోషించాడు.

వాట్సన్‌ మాట్లాడుతూ

కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా అవతారమెత్తిన వాట్సన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేకేఆర్‌ కోచింగ్‌ గ్రూప్‌, ప్లేయర్స్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కోల్‌కతాకు మరో టైటిల్‌ను తీసుకువచ్చేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పాడు. కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ వాట్సన్‌ను కేకేఆర్‌ ఫ్యామిలీలోకి స్వాగతించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఆటగాడిగా, కోచ్‌గా అతనికున్న అనుభవం జట్టుకు ఎంతో దోహదపడుతుందని చెప్పాడు.

అభిషేక్‌ నాయర్‌ (Abhishek Nair) ను కేకేఆర్‌ ఇటీవల హెడ్‌కోచ్‌గా నియమించింది. ముంబయి మాజీ ఆల్ రౌండర్ అయిన నాయర్‌కు కేకేఆర్‌తో చాలా రోజులుగా అనుబంధం ఉన్నది. అయితే, ఐపీఎల్‌ 2025లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండగా.. కేకేఆర్‌ జట్టును బలోపేతం చేయాలని భావిస్తుంది. కేకేఆర్‌ గత సీజన్‌లో ఆడిన 14 లీగ్‌ మ్యాచుల్లో కేవలం ఐదింట్లో గెలిచింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870