📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Mohammed Shami: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై స్పందించిన షమీ

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా (Team India) సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లో నిలిచాడు. గత కొంతకాలంగా జట్టులో చోటు దక్కకపోవడంతో, ఆయన భవిష్యత్‌పై పలు ఊహాగానాలు సోషల్ మీడియా (Social media) లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు షమీని ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా స్వయంగా షమీ (Mohammed Shami) స్పందించాడు.

Cristiano Ronaldo: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్‌బాల్ బిలియనీర్‌గా రొనాల్డో

“ఆస్ట్రేలియా సిరీస్‌ (“Australia Series”) కు నన్ను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్, పుకార్లు వస్తున్నాయి. దీనిపై నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నా. జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్టర్లు, కోచ్, కెప్టెన్ చూసుకుంటారు.

Mohammed Shami

జట్టుకు నా అవసరం ఉందని వారు భావిస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. నేను మాత్రం ఆటకు సిద్ధంగా ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాను” అని షమీ వివరించారు.తన ఫిట్‌నెస్‌పై కూడా షమీ పూర్తి స్పష్టత ఇచ్చాడు. “నా ఫిట్‌నెస్ చాలా బాగుంది. ఇటీవలే దులీప్ ట్రోఫీ (Duleep Trophy) లో ఆడాను. సుమారు 35 ఓవర్లు బౌలింగ్ చేసినా చాలా సౌకర్యంగా అనిపించింది.

ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి సమస్యలు లేవు

నా రిథమ్ కూడా బాగుంది. ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి సమస్యలు లేవు” అని ఆయన తెలిపారు. ఆటకు దూరంగా ఉన్నప్పుడు ప్రేరణతో ఉండటం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.అలాగే, వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) ను నియమించడంపై కూడా షమీ మాట్లాడాడు.

“ఈ అంశంపై కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. నా దృష్టిలో దీనిపై ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఇది పూర్తిగా బీసీసీఐ (BCCI), సెలక్టర్లు, కోచ్‌ల నిర్ణయం. గిల్‌కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా, ఇంగ్లండ్‌లో భారత జట్టును నడిపించిన అనుభవం ఉంది.

ఈ బాధ్యత ఎవరో ఒకరికి ఇవ్వాలి, బీసీసీఐ గిల్‌ను ఎంచుకుంది. మనం దానిని అంగీకరించాలి,” అని షమీ అన్నారు. కెప్టెన్సీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని, ఈరోజు ఒకరు ఉంటే రేపు మరొకరు వస్తారని, దానిపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని ఆయన సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Mohammed Shami Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.