📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Virat Kohli: ఆస్ట్రేలియాతో సిరీస్‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ పోస్ట్

Author Icon By Anusha
Updated: October 16, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చకు కారణమైంది. ఆస్ట్రేలియాతో రాబోయే మూడు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ (Virat Kohli) ఈ ట్వీట్ ద్వారా తన మానసిక స్థితిని, జట్టు సన్నద్ధతను చూపిస్తూ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాడు. భారత క్రికెట్ అభిమానులు ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి, వివిధ రియాక్షన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Ravi Shastri: కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై స్పందించిన రవిశాస్త్రి

సాధారణంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడని కోహ్లీ చేసిన ఈ పోస్ట్ ఆయన వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలకు దారి తీసింది. 2027 ప్రపంచకప్‌ (2027 World Cup) లో ఆడతారా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో కోహ్లీ “నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడే, నువ్వు నిజంగా ఓడిపోతావు” అంటూ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం ఒక సాధారణ కొటేషన్ కాదని, కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనకు తాను మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో చెప్పేందుకు కోహ్లీ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన పట్టువదలని తత్వానికి ఈ మాటలు అద్దం పడుతున్నాయని పేర్కొంటున్నారు.

మరోసారి జట్టుకు విజయాన్ని అందిస్తాడని

పెర్త్ నుంచి వచ్చిన ఈ పవర్‌ఫుల్ మెసేజ్‌తో, రాబోయే సిరీస్‌లో ‘కింగ్ కోహ్లీ’ తన అద్భుత ప్రదర్శనతో మరోసారి జట్టుకు విజయాన్ని అందిస్తాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. వీరిద్దరి రీఎంట్రీ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.

కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు

చివరిసారిగా కోహ్లీ భారత జట్టు కోసం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో కఠినమైన పిచ్‌లపై కూడా కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును అన్ని గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లలో విజయతీరాలకు చేర్చాడు. 2

025లో ఆస్ట్రేలియా టూర్ తర్వాత కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను కూడా గెలుచుకోవడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Australia series Breaking News latest news Team India Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.