జింబాబ్వే స్టార్ బ్యాటర్, సీనియర్ ఆటగాడు షాన్ విలియమ్స్ (Sean Williams) జట్టుకు దూరమయ్యాడు. రాబోయే T20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌కు విలియమ్స్ అందుబాటులో ఉండరని జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) అధికారికంగా ప్రకటించింది. యాంటీ-డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ రీన్యువల్ చేయకూడదని నిర్ణయం తీసుకుంది.
Read Also: Cristiano Ronaldo: త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటా: రొనాల్డో
బోర్డు విడుదల చేసిన ప్రకటనలో, “విలియమ్స్ ప్రస్తుతం వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారు. డ్రగ్ అడిక్షన్ కారణంగా ఆయన రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చేరారు. షాన్ విలియమ్స్ చికిత్స పొందుతున్నాడు. క్రీడా నిబంధనలను కాపాడేందుకు, క్రమశిక్షణా ప్రమాణాలను నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని పేర్కొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: