టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో, మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య (Scotland vs Italy) మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టాస్ పూర్తయింది. టాస్ గెలిచిన ఇటలీ జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. గ్రూప్ సిలో ఉన్న ఇటలీకి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ప్రస్తుత ఎడిషన్‌లో స్కాట్లాండ్ ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
Read Also: Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ ప్రత్యేక ఆతిథ్యం
తుది జట్లు
ఇటలీ జట్టులో జస్టిన్ మోస్కా, ఆంథోనీ మోస్కా, స్మట్స్, వేన్ మాడ్సెన్ (కెప్టెన్), హ్యారీ మానెంటి, బెన్ మనేంటి, జియాన్ మీడే (వికెట్‌కీపర్), గ్రాంట్ స్టీవర్ట్, క్రిషన్, అలీ హసన్, థామస్ డ్రాకా ఉన్నారు. స్కాట్లాండ్ జట్టులో జార్జ్ మున్సే, మైకేల్ జోన్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్(వికెట్‌కీపర్), మార్క్ వాట్, మైకేల్ లీస్క్, ఆలివర్ డేవిడ్సన్, బ్రాడ్ వీల్, బ్రాడ్ క్యూరీ ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: