టీమ్ ఇండియా సెలెక్టర్లకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే సర్ఫరాజ్ ఖాన్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం (డిసెంబర్ 31, 2025) గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్-సి మ్యాచ్‌లో సర్ఫరాజ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోవా జట్టుపై విరుచుకుపడి, ముంబై జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇదే!
నాలుగో అత్యధిక స్కోరు
ఈ మ్యాచ్ లో 75 బంతుల్లో 157 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్‌కు చేర్చాడు. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో టీ20 శైలిలో బ్యాటింగ్ చేశాడు. ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (58) సహకారంతో ముంబై 50 ఓవర్లలో 448 పరుగులు చేసింది. ఇది టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు. ఈ ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
మరోవైపు గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైపై ఆడిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన అర్జున్.. 7 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 62 పరుగులు సమర్పించుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: