టీమిండియా వరుస విజయాల వెనుక ప్రధాన కారణంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రను గుర్తిస్తూ, వెటరన్ వికెట్ కీపర్,బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సానుకూల వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడు అయిన సంజూ శాంసన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఈ ఇద్దరు క్రీడాకారుల నేతృత్వం, ప్రేరణ వల్లే టీమిండియా నిరంతర విజయాలను సాధిస్తున్నారని గుర్తించారు.
ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలవడంతో, ఈ జట్టు ప్రదర్శనలో గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ యొక్క ప్రాముఖ్యత స్పష్టమైంది.ఈ గెలుపుతో టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. మూడింటికి మూడు మ్యాచ్‌లు గెలిచి సగర్వంగా సూపర్-4 (Super-4) లోకి అడుగుపెట్టింది.
ఒమన్అద్భుతంగా బౌలింగ్ చేసింది
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ (Player of the Match Award) దక్కింది. మ్యాచ్ అనంతరం బీసీసీఐ (BCCI) టీవీతో మాట్లాడిన సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.’నిజాయితీగా చెప్పాలంటే మిడిలార్డర్‌లో కొంత సమయం గడిపే అవకాశం దక్కడం నా అదృష్టం.
సొంతగడ్డపై నేను కొన్ని మంచి ప్రదర్శనలు చేసాను. కానీ దేశం తరఫున ఆసియా కప్‌లో ఆడుతున్నప్పుడు మిడిల్‌లో గేమ్ టైమ్ దొరకడం కలిసొచ్చింది. నిజం చెప్పాలంటే పవర్ ప్లేలో ఒమన్ (OMAN) అద్భుతంగా బౌలింగ్ చేసింది. మా కంటే మెరుగ్గా పరిస్థితులను అంచనా వేసింది. దాంతో మేం కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చింది.
ఓపెనింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదించాను
పరిస్థితులతో పాటు ప్రత్యర్థిని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అభిషేక్ (Abhishek) తో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదించాను. అతనితో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. బ్యాటింగ్ చాలా ఈజీగా అనిపిస్తోంది. ఒమన్‌తో మ్యాచ్‌లో మా చిన్న భాగస్వామ్యాన్ని మేం ఆస్వాదించాం.అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: