📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sanju Samson: రోహిత్ శర్మ నా ఫేవరేట్ క్రికెటర్

Author Icon By Anusha
Updated: August 10, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్‌లో తన ప్రత్యేకమైన ఆటతీరు, చల్లని మనస్తత్వం, సహజమైన స్ట్రోక్ ప్లే, కీలక సందర్భాల్లో జట్టును ముందుకు నడిపే సామర్థ్యం ఉంది. ఆయనను అభిమానించే వారి జాబితాలో అనేక మంది క్రికెటర్లు, అభిమానులు ఉన్నప్పటికీ, ఇటీవల సంజూ శాంసన్ (Sanju Samson) చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.సంజూ శాంసన్, ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడుతున్నాడు. అతను తన కెరీర్‌లో అనేకమంది లెజెండరీ క్రికెటర్లను చూసినా, తన ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్‌గా రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతను తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

రోహిత్ శర్మే తనకు ఆరాధ్యుడు అని తెలిపాడు

సాధారణంగా ఈ తరం వికెట్ కీపర్లు తమ అభిమాన క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ లేదా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) పేర్లు చెబుతుంటారు. కానీ సంజూ మాత్రం తన అభిరుచి విభిన్నంగా ఉంటుందని చెప్పి, రోహిత్ శర్మే తనకు ఆరాధ్యుడు అని తెలిపాడు.సంజూ శాంసన్ చెప్పినట్లుగా, రోహిత్ శర్మలో ఉన్న కూల్ నెస్, మ్యాచ్ ప్రెజర్‌ను హ్యాండిల్ చేసే తీరు, జట్టును సపోర్ట్ చేసే ఆలోచనశైలి అతనికి ఎంతో ప్రేరణనిస్తాయి. రోహిత్, పెద్ద స్కోర్ల కోసం మాత్రమే కాకుండా, మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో కూడా నైపుణ్యం కలవాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ప్రతిదానికి ఓపికతో ఆడుతూ, అవసరమైనప్పుడు శీఘ్రగతిలో రన్స్ సాధించే విధానం అతని ప్రత్యేకత.

అతను మాట్లాడిన మాటలతోనే అభిమానిగా మారిపోయా

ఈ తరం క్రికెట్‌లో అశ్విన్‌కు నచ్చే ఆటగాడు ఎవరా? అని సంజూ శాంసన్ ప్రశ్నించగా.. అతను 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు చెప్పాడు. అతని ఆటను చూసేందుకు తాను చాలా ఉత్సాహం చూపిస్తానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తనకు చివరి నిమిషంలో చోటు దక్కలేదని, ఈ విషయాన్ని రోహిత్ శర్మ (Rohit Sharma) నే వెల్లడించాడని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంగా అతను మాట్లాడిన మాటలతోనే అభిమానిగా మారిపోయానని చెప్పాడు.టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఆడే అవకాశం నాకు వచ్చింది. మ్యాచ్‌కు ముందు సిద్దంగా ఉండాలని చెప్పారు. నేను కూడా రెడీ అయ్యాను. సరిగ్గా టాస్ ముందే తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. వామప్ సమయంలో రోహిత్ నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. ఆ నిర్ణయం వెనుక గల కారణాన్ని వెల్లడించాడు. నేను వెంటనే అర్థం చేసుకోగలను. ముందు మ్యాచ్ గెలవండి. ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను.

రోహిత్ వ్యక్తిత్వం

ఒక్క నిమిషం తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చిన రోహిత్.. నాకు తెలుసు నువ్వు నన్ను తిట్టుకుంటున్నావు. నువ్వు సంతోషంగా లేవు. నీ మనసులో ఏదో ఉందని అన్నాడు. నేను ఓ ఆటగాడిగా ఆడాలనుకుంటున్నాను. కానీ అంతకంటే ముందు ఈ జట్టు గెలవడం ముఖ్యమని చెప్పాను. అప్పుడే రోహిత్ వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైంది. వరల్డ్ కప్ ఫైనల్ ముందు జట్టులో లేని ఆటగాడికి 10 నిమిషాలు కేటాయించి.. జట్టులోకి ఎందుకు తీసుకోలేదోనని చెప్పడం మాములు విషయం కాదు.ఎవరూ కూడా ఇలా చేయరు. నేను అయితే నా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేవాడిని. తర్వాత మాట్లాడుతాలే అనుకునేవాడిని. కానీ రోహిత్ మాత్రం అలా చేయకుండా నన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ క్షణమే అతను నా మనసులో చోటు సంపాదించాడు.అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ పూర్తి పేరు ఏమిటి?

రోహిత్ గురునాథ్ శర్మ.

రోహిత్ శర్మ ఎప్పుడు జన్మించారు?

30 ఏప్రిల్ 1987.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ricky-ponting-brian-lara-is-the-best-batsman-in-the-history-of-cricket/sports/528433/

Favourite Cricketer Indian Cricket MS Dhoni ODI Captain Ravichandran Ashwin Rohit sharma Sanju Samson Wicket Keeper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.