Sanju Samson : భారత వికెట్‌కీపర్ బ్యాటర్ Sanju Samson గురించి మాజీ టెస్ట్ కెప్టెన్ Ajinkya Rahane కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడని, దీనికి ప్రధాన కారణం అతనిపై ఏర్పడిన ఒత్తిడేనని రహానే అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 16 పరుగులే చేయడం సంజూలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించిందన్నాడు.
Read Also: Budget 2026: బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!
సంజూ శాంసన్, Abhishek Sharma లా దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తూ అనవసర ఒత్తిడికి గురవుతున్నాడని రహానే పేర్కొన్నాడు. వాస్తవానికి సంజూ తన సహజ శైలిలో ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించాడు. ఈ దశలో (Sanju Samson) కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ పాత్ర చాలా కీలకమని, ప్రపంచ కప్ జట్టులో చోటు ఖాయం అన్న భరోసాను కోచ్ Gautam Gambhir సంజూకు ఇవ్వాలని సూచించాడు.
జట్టులో తన స్థానం సురక్షితమనే నమ్మకం కలిగితే సంజూ మళ్లీ తన ఆటను ఆస్వాదిస్తాడని రహానే అన్నాడు. కాగా, వికెట్‌కీపర్ స్థానం కోసం Ishan Kishan నుంచి సంజూకు గట్టి పోటీ ఎదురవుతుండటం కూడా అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: