📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sanjay Manjrekar: టీమిండియా బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar తీవ్ర విమర్శలు చేశారు. భారత బ్యాటర్లకు స్వదేశీ పిచ్‌లపై ఆడేందుకు సరైన శిక్షణ కొరవడిందని, వారు ‘ఎన్నారై’ల (నాన్-రెసిడెంట్ ఇండియన్స్) మాదిరిగా తయారయ్యారని ఆయన (Sanjay Manjrekar) ఘాటుగా వ్యాఖ్యానించారు.”ఒక భారత బ్యాటర్ దేశవాళీ క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చాక, అతను ఒక ఎన్నారైలా మారిపోతున్నాడు.

Read Also: Lionel Messi: హైదరాబాద్ కు మెస్సీ.. ప్రారంభమైన టికెట్ల విక్రయం

ఎలాంటి అనుభవం లేకుండా బరిలోకి దిగుతున్నారు

ఎందుకంటే స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నాడు” అని మంజ్రేకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు గత రెండేళ్లలో విదేశాల్లో 9 నుంచి 12 టెస్టులు ఆడితే, భారత్‌లో ఆడినవి చాలా తక్కువ అని ఆయన గుర్తుచేశారు.

Sanjay Manjrekar slams Team India’s batsmen

ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడకుండా నేరుగా స్వదేశంలో టెస్టులు ఆడుతుండటంతో, టర్నింగ్ పిచ్‌లపై ఎలాంటి అనుభవం లేకుండా బరిలోకి దిగుతున్నారని విశ్లేషించారు.టర్నింగ్ ట్రాక్‌లపై పవర్ గేమ్‌తో నెగ్గుకురాలేమని, దానికి బదులుగా సున్నితమైన నైపుణ్యాలు అవసరమని మంజ్రేకర్ సూచించారు. ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై ‘నిలబడి బాదడం’ కొంతమేర ఫలితాన్ని ఇవ్వొచ్చు కానీ,

స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆ వ్యూహం పని చేయదని స్పష్టం చేశారు. అయితే, ఈ వైఫల్యాలకు పూర్తిగా బ్యాటర్లను నిందించలేమని అన్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత జట్టు పర్యటన ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నాయని, అందుకే విదేశీ టూర్లు ఎక్కువగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

India vs South Africa Test series latest news Sanjay Manjrekar Team India batting failure Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.