ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత జట్టు బహిష్కరించడంతో వివాదం చెలరేగింది. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో, ఈ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ తీవ్రంగా మండిపాటు
ఈ పరిణామంపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ (Salman Butt) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, భారత జట్టు (team India) తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ- ఐసీసీ ఈవెంట్‌లో రెండు జట్లు తలపడనున్నప్పుడు కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తామని భారత్ హామీ ఇవ్వాలని కోరాడు.
“ప్రపంచం మొత్తం వారి గురించి మాట్లాడుకుంటోంది. వారు క్రికెట్‌కు, అభిమానులకు ఏం సందేశం పంపారు? మీరు ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు? మీరు ఏమి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు ప్రపంచ కప్‌లో ఆడకండి ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ మాకు వ్యతిరేకంగా ఆడకండి. ఈ విషయమై భారత్ ఒక వాగ్దానం చేయాలి. ఏ స్థాయిలో లేదా టోర్నమెంట్‌లో మాపై ఆడకండి. ఒలింపిక్స్‌లో కూడా.
“ఇది మనస్తత్వ సమస్య, వ్యక్తిగత నిర్ణయం కాదు”
ఈ మనస్తత్వం ఏమిటి? నాకైతే అర్థం కాలేదు. ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారో? ఆడకూడదని నిర్ణయించుకున్న ఆ 4-5 మంది. వారి కారణంగా ఆడాలనే మనస్తత్వం ఉన్న ఇతరులు కూడా ఒత్తిడికి గురయ్యారు” అని భట్ (Salman Butt) అన్నాడు.
యువరాజ్ నేతృత్వంలోని జట్టు బహిష్కరణపై చర్చ
ఈ బహిష్కరణ నిర్ణయం యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు తీసుకున్నదని తెలుస్తోంది. బహిష్కరణకు రాజకీయ లేదా భద్రతా కారణాలేమైనా ఉండొచ్చు, కానీ ఆటగాళ్లుగా తమ నైతిక బాధ్యతను గుర్తించి నిర్ణయం తీసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు .
Read hindi news: hindi.vaartha.com
read also: Farokh Engineer : భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం!