📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

SA vs NZ: నేడే తొలి సెమీఫైనల్.. సౌతాఫ్రికా vs న్యూజిలాండ్ సమరం

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SA vs NZ: టీ20 ప్రపంచకప్‌లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత ఏడాది (2024) ఫైనల్ వరకు వచ్చి టీమ్ ఇండియా చేతిలో తృటిలో టైటిల్‌ను చేజార్చుకున్న ప్రోటీస్ జట్టు, ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే పట్టుదలతో ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా దూసుకొస్తున్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ చావో రేవో వంటిది.

Read Also: Arjun Tendulkar and Saaniya Chandhok’s pre-wedding bash : సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సచిన్ ఫ్యామిలీ

మ్యాచ్ టైమింగ్స్

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా జట్టు అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. గ్రూప్ దశలోనే న్యూజిలాండ్‌ను ఓడించిన సఫారీలు, సూపర్-8లో భారత్‌పై ఘన విజయం సాధించి ఫేవరెట్‌గా నిలిచింది. మరోవైపు నెట్ రన్‌రేట్ కలిసొచ్చి సెమీస్‌కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్‌ రికార్డ్‌లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

SA vs NZ: Today’s first semi-final.. South Africa vs New Zealand match

దక్షిణాఫ్రికా జట్టు అంచనా

క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, డివాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, నోకియా, లుంగి ఎంగిడి.

న్యూజిలాండ్ జట్టు అంచనా

ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), లాకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ/కైల్ జెమీసన్, జాకబ్ డప్ఫీ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cricket News Eden Gardens SA vs NZ T20 World Cup 2026 Semifinal 1

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.