📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ruturaj Gaikwad: యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్, వ్యక్తిగత కారణాలతో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌ (Cricket Club) తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని యార్క్‌షైర్ క్లబ్ 2025, జూలై 18న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.ఇండియా ‘ఏ’ జట్టు మాజీ కెప్టెన్ రుతురాజ్, జులై 22న సర్రే జట్టుతో జరగనున్న తన మొదటి కౌంటీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని చాలా మంది ఆశించారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లాండ్‌ (England) కు రాలేడని యార్క్‌షైర్ కౌంటీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల రుతురాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ ఆకస్మికంగా వైదొలగడానికి గల సరైన కారణం ఇప్పటివరకు వెల్లడి కాలేదు. రుతురాజ్ గైక్వాడ్ వైదొలగడంపై యార్క్‌షైర్ జట్టు ప్రధాన కోచ్ ఆంథోనీ మెక్‌గ్రా తన నిరాశను వ్యక్తం చేశాడు. 

ప్రత్యామ్నాయ ఆటగాడిని

ప్రధాన కోచ్ ఆంథోనీ మెక్‌గ్రా మాట్లాడుతూ, “దురదృష్టవశాత్తు రుతురాజ్ గైక్వాడ్ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం రావడం లేదు. ఈ సీజన్‌లో రుతురాజ్ మా జట్టులో ఉండడకపోవడం నిరాశ కలిగిస్తుంది. అతను వైదొలగడానికి గల కారణాన్ని నేను చెప్పలేను. కానీ అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నాము. రుతురాజ్ బదులుగా ప్రత్యామ్నాయ ఆటగాడిని బరిలోకి దింపగలమా అనేది పరిశీలిస్తున్నాం. కానీ మ్యాచ్‌కు ఇంకా రెండు లేదా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవడం కష్టం.” అని వెల్లడించాడు.రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్ జట్టు (Yorkshire team) తరపున ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, లిస్ట్ ‘ఏ’ మ్యాచ్‌లలో ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. 

Ruturaj Gaikwad: యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్

అధికారిక మ్యాచ్‌లోనూ

అంతకుముందు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించిన రుతురాజ్ మోచేతి గాయం కారణంగా టోర్నమెంట్ మధ్యలో వైదొలిగాడు. ఏప్రిల్ 8 తర్వాత అతను ఏ అధికారిక మ్యాచ్‌లోనూ ఆడలేదని గమనార్హం.ఇటీవల భారత ‘ఏ’ జట్టుతో ఇంగ్లాండ్‌కు పయనమైన రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అయినప్పటికీ, అనధికారిక టెస్ట్ సిరీస్‌లలో అతను బరిలోకి దిగలేదు. అతని కౌంటీ మ్యాచ్‌లో పాల్గొనడం అతని క్రికెట్ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని ఆశించగా, ఈ ఆకస్మిక వైదొలగడం అతని అభిమానులలో తీవ్ర నిరాశను కలిగించింది.

రుతురాజ్ గైక్వాడ్ జననం ఎక్కడ జన్మించారు.?

రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర రాష్ట్రం, పుణేలో 31 జనవరి 1997న జన్మించారు.

రుతురాజ్ గైక్వాడ్ ఏ జట్టుకు ఐపీఎల్‌లో ఆడతారు?

ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడతారు. 2024 ఐపీఎల్ సీజన్‌లో అతను CSK జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Mohammad Azharuddin: మహ్మద్ అజారుద్దీన్‌ ఇంట్లో భారీ చోరీ..

Breaking News latest news Ruturaj Gaikwad Ruturaj Gaikwad news Ruturaj Gaikwad personal reasons Ruturaj Gaikwad Yorkshire Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.