📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: Lionel Messi: మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

Author Icon By Anusha
Updated: December 15, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఐకాన్, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారతదేశ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన మెస్సీ, ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో సందడి చేశారు. ఈ రెండు నగరాల్లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.

Read Also:  IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం

దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 10.45 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన మెస్సీ (Lionel Messi) విమానం కొంత ఆలస్యమైనట్లు సమాచారం. మెస్సీ రాక సందర్భంగా ఢిల్లీలో భద్రతను అసాధారణ స్థాయిలో కట్టుదిట్టం చేశారు.మెస్సి, అతని టీం కోసం చాణక్యపురిలోని ది లీలా ప్యాలెస్‌ (Leela Palace) లో ప్రత్యేకంగా ఓ అంతస్తు మొత్తాన్ని రిజర్వ్‌ చేశారు. అర్జెంటీనా జట్టు హోటల్‌లోని ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌లో బస చేయనుంది.

ఇక్కడ ఒక్క రాత్రికి రూ.3.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఖర్చవుతుందని సమాచారం. ఇక మెస్సి బస గురించి ఎలాంటి వివరాలను పంచుకోవద్దని అక్కడి హోటల్‌ సిబ్బందికి నిర్వాహకులు కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా తెలిపాయి. ఇక ఈ స్టార్‌ ప్లేయర్‌ బస చేసే హోటల్‌ చుట్టూ భద్రతను పెంచారు.

రూ. 1 కోటి వరకూ చెల్లిస్తున్నట్లు సమాచారం?

మెస్సీని ప్రత్యక్షంగా కలిసే అవకాశం కోసం పలువురు కార్పొరేట్ సంస్థల అధిపతులు, వీఐపీలు భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. మెస్సీని కలిసి హ్యాండ్‌షేక్ చేసే అవకాశం కోసం కొందరు కార్పొరేట్లు ఏకంగా రూ. 1 కోటి వరకూ చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. హోటల్‌లో ప్రత్యేకంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Rs.1 crore for a handshake with Messi..

ఢిల్లీ పర్యటనలో మెస్సి.. భారత ప్రధాన న్యాయమూర్తి, పలువురు ఎంపీలు, క్రికెటర్లు, ఒలింపిక్‌, పారాలింపిక్‌ పతక విజేతలను కలవనున్నారు. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియాన్ని సందర్శించనున్నారు మెస్సి. అక్కడే భారత క్రికెట్‌ బృందంతో సంభాషించనున్నట్లు తెలుస్తోంది.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పారాలింపిక్‌లో బంగారు పతక విజేత సుమిత్‌ అంటిల్‌,

ఇవాళ సాయంత్రం 6 గంటలకు మెస్సి ఇండియా టూర్‌ ముగియనుంది

బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌,ఒలింపిక్‌ హైజంప్‌ పతక విజేత నిషాద్‌ కుమార్‌ సహా పలువురిని మీట్‌ అవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మెస్సి ఇండియా టూర్‌ ముగియనుంది. రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని మెస్సి వెళ్లిపోనున్నారు.

తన పర్యటనలో ప్రధాని మోదీతో కూడా మెస్సి భేటీ అవుతారని ముందుగా వార్తలు వచ్చాయి. మొదట ప్రధాని మోదీని కూడా మెస్సీ కలుస్తారని వార్తలు వచ్చినా.. మోదీ సోమవారం ఉదయమే మూడు దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లడంతో ఆ భేటీ జరగలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Argentina football icon GOAT India Tour handshake with Messi latest news Lionel Messi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.