📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Cristiano Ronaldo: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్‌బాల్ బిలియనీర్‌గా రొనాల్డో

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫుట్‌బాల్ చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేసిన పోర్చుగీస్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo), ఆటతీరు మాత్రమే కాకుండా ఆర్థిక విజయాలతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యధిక ఆదాయం సంపాదించిన ఆటగాడిగా, అలాగే మొట్టమొదటి ఫుట్‌బాల్ బిలియనీర్‌ (Football billionaire) గా రొనాల్డో పేరు చరిత్రలో నిలిచిపోయింది.

IND vs South Africa: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్

రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ (Bloomberg) వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం, రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు 1.4 బిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 11,600 కోట్లు) దాటిందని వెల్లడించారు.

ఫుట్‌బాల్ ఫీల్డ్ నుంచి ఫైనాన్స్ వరకూ

కేవలం ఆటతోనే కాదు, తన బ్రాండ్ విలువతో కూడా రొనాల్డో (Cristiano Ronaldo)ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాడు. 2002లో స్పోర్టింగ్ లిస్బన్ (Sporting Lisbon) తరపున కెరీర్ ఆరంభించిన ఆయన, తరువాత మాంచెస్టర్ యునైటెడ్,

రియల్ మాడ్రిడ్, యువెంటస్, ఇప్పుడు అల్ నస్సర్ జట్టులతో ఆడుతూ అనేక రికార్డులు సృష్టించాడు. ఈ ప్రయాణంలో రొనాల్డో 5 బెలన్ డి’ఓర్ అవార్డులు, అనేక లీగ్ టైటిళ్లు, యూరో చాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నాడు.

Cristiano Ronaldo

వ్యాపారవేత్తగా రొనాల్డో

రొనాల్డో కేవలం ఆటగాడే కాదు, ఒక బ్రాండ్ ఐకాన్ కూడా. “CR7” అనే తన స్వంత బ్రాండ్ పేరుతో దుస్తులు, పరిమళాలు, షూస్, ఫిట్‌నెస్ సెంటర్లు, హోటళ్లు, ఇన్వెస్ట్మెంట్‌లు వంటి విభిన్న రంగాల్లో భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా (Social media) లో కూడా అతని ప్రభావం విశేషం — ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లోనే 600 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తి ఆయనే. ఒక్క స్పాన్సర్డ్ పోస్ట్‌కే ఆయనకు మిలియన్ల రూపాయల ఆదాయం వస్తుంది.

గడిచిన రెండు దశాబ్దాలుగా కేవలం ఫుట్‌బాల్ జీతాలు, ప్రచార ఒప్పందాల ద్వారానే ఆయన దాదాపు 550 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజీన్ (Forbes Magazine) 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో కూడా రొనాల్డో (Cristiano Ronaldo) అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో ఆయన లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబప్పే వంటి స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టారు.

డా ప్రపంచంలో కొత్త రికార్డు

నైకీ, ఆర్మేనీ, కాస్ట్రోల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లతో ఆయనకు ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా ఆదాయానికి స్థిరమైన పునాది వేశాయి.అయితే, కొన్ని నివేదికలు ఆయన ఆస్తి విలువ 800 మిలియన్ డాలర్ల నుంచి 1.45 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంటున్నాయి. ఏదేమైనప్పటికీ, ఫుట్‌బాల్ (Football) చరిత్రలో బిలియనీర్ స్థాయికి చేరిన మొట్టమొదటి ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.

క్రీడాకారుల్లో బిలియనీర్ స్థాయిని చేరిన రొనాల్డోతో పాటు బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, గాల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ఉన్నారు. అయితే, ఫుట్‌బాల్ రంగంలో ఇలాంటి స్థాయికి చేరిన తొలి ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఇది ఫుట్‌బాల్ ఆర్థిక పరంగా ఎంత విస్తృతంగా ఎదిగిందో కూడా సూచిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Cristiano Ronaldo football billionaire latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.